కెమెరాతో కలల చిత్రాలు.. అవార్డులతో నవీన్ ఖ్యాతి!

కెమెరాతో కలల చిత్రాలు.. అవార్డులతో నవీన్ ఖ్యాతి!
నవీన్


చర్చ:నేలకొండపల్లి అక్టోబర్ 05: ఒక్క ఫొటో ఒక జ్ఞాపకాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుతుంది. ఆ జ్ఞాపకానికి కళను జోడించి.. ప్రతి క్షణాన్ని అందమైన చిత్రంగా మలుస్తున్నాడు నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అమరబోయిన నవీన్. ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తిని వృత్తిగా మలచుకుని, వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న నవీన్.. వరుస అవార్డులతో తన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్‌ షోలో నవీన్‌ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, ట్రేడ్‌ షో నిర్వాహకులు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ పోటీల్లో ‘ఉత్తమ వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ అవార్డు’తో పాటు ‘భారత్‌ కళా పురస్కార్‌-2026’కు నవీన్‌ ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను నిర్వాహకులు, ఫొటోగ్రఫీ రంగానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు.

ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు

వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీని కేవలం ఫొటోలు తీయడంగా కాకుండా.. వివాహ వేడుకలోని భావోద్వేగాలు, ఆనందం, అనుబంధాలను సహజంగా కెమెరాలో బంధించడమే లక్ష్యంగా నవీన్‌ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనదైన ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసుకుని ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రతిభకు ఇప్పటికే పలువురు ప్రశంసలు అందించగా.. తాజాగా ఒకేసారి రెండు ప్రతిష్ఠాత్మక గుర్తింపులు రావడం విశేషంగా నిలిచింది.

ఈ అవార్డులు మరింత బాధ్యత పెంచాయి

ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ.. తన ప్రతిభను గుర్తించి ఉత్తమ వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ అవార్డు, భారత్‌ కళా పురస్కార్‌-2026కు ఎంపిక చేయడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ గుర్తింపును అందించిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఫొటోగ్రఫీ ప్రయాణంలో ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఎం.సి. శేఖర్‌, ట్రేడ్‌ షో నిర్వాహకులు ఎడిట్‌ పాయింట్‌ రమేష్‌, ఫొటోటెక్‌ అధినేత అభిమన్యురెడ్డి తదితరులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఆచార్లగూడెం నుంచి మొదలైన ఫొటోగ్రఫీ ప్రయాణం.. జాతీయ స్థాయి అవార్డుల వేదిక వరకు చేరడం ద్వారా అమరబోయిన నవీన్‌ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Latest News

Read More...
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.

23-10-2026 11:16 pm

నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.
నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.

23-10-2026 06:47 pm

నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.
నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.

23-10-2026 06:33 pm

నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.
నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

23-10-2026 06:22 pm

నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.
నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.

23-10-2026 05:01 pm