నేటి చర్చ : జగిత్యాల జిల్లా కేంద్రంలో, మహిషాసురుడి చేతిలో కాక్రోచ్ తో వినూత్న నిరసన.

నేటి చర్చ : జగిత్యాల జిల్లా కేంద్రంలో, మహిషాసురుడి చేతిలో కాక్రోచ్ తో వినూత్న నిరసన.
Cockroach in Ravanasura hand

మహిషాసురుడి చేతిలో కాక్రోచ్ .

జగిత్యాల జమ్మిగద్దెపై వ్యంగ్యాస్త్రం!_

చర్చ, జగిత్యాల:_ మహిషాసుర దహనం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. కానీ జగిత్యాల జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక జమ్మిగద్దె వద్ద జరిగిన మహిషాసుర దహన కార్యక్రమంలో ఓ వినూత్న ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. మహిషాసురుడి చేతిలో బొద్దింకను ఉంచి ప్రదర్శించిన కనకదుర్గ సేవా సమితి, “బొద్దింకల వంటి వ్యక్తులను నమ్మకండి” అంటూ వ్యంగ్య సందేశాన్ని వినిపించింది.

విజయదశమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ ప్రదర్శన పండుగ సందడిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా రావణాసుర, మహిషాసుర దహనాలతో చెడుపై మంచి విజయాన్ని చాటిచెప్పే వేడుకల్లో.. ఈసారి బొద్దింకను ప్రతీకగా ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

దేశవ్యాప్తంగా ‘కాక్రోజ్ జనతా పార్టీ’ పేరుతో జరుగుతున్న నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఈ ప్రదర్శనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బొద్దింకను చేతిలో ఉంచిన మహిషాసురుడి రూపం ద్వారా సమితి ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని ఇచ్చిందన్న ఆసక్తి స్థానికంగా వ్యక్తమైంది.

పండుగ వేడుకలకే పరిమితం కాకుండా, ప్రతీకాత్మక ప్రదర్శనతో సమాజానికి ఓ సందేశాన్ని అందించే ప్రయత్నం చేయడం విశేషం. జమ్మిగద్దె వద్ద జరిగిన ఈ వినూత్న ప్రదర్శన విజయదశమి వేడుకల్లో ప్రత్యేక చర్చకు తెరలేపింది.

Latest News

Read More...
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.

23-10-2026 11:16 pm

నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.
నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.

23-10-2026 06:47 pm

నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.
నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.

23-10-2026 06:33 pm

నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.
నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

23-10-2026 06:22 pm

నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.
నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.

23-10-2026 05:01 pm