భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

Views :0

Pothole at Bhadrachalam Main center

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో, అంబేద్కర్ సెంటర్‌లోని సంజయ్ బేకరీ ఎదురుగా ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది.

అది కూడా మూలమలుపులో ఉండటంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే బాధ్యత ఎవరిది?

అంతేకాకుండా గత కొన్ని నెలలుగా అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా పనిచేయడం లేదు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత ఆర్ & బి అధికారులు, ట్రాఫిక్ అధికారులు స్పందించి వెంటనే భారీ గుంతను పూడ్చి, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలి.

ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు చేపట్టాలని భద్రాచలం ప్రజలు కోరుతున్నారు.

ప్రజల భద్రత అధికారుల బాధ్యత!

Latest News

Read More...
ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం. ముగ్గురు అరెస్ట్

09-11-2026 08:04 pm

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm