మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పెద్దమ్మ గుడికి రూ.లక్ష విరాళం అందజేసిన కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావు.

మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పెద్దమ్మ గుడికి రూ.లక్ష విరాళం అందజేసిన కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావు.
నేటి చర్చ : పాల్వంచ , 28 అక్టోబర్ 2026: రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఇంద్రనగర్ కాలనీ 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావు ఉదారత చాటుకున్నారు.
పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహించే నిత్య అన్నదాన పథకం కోసం రూ.1,00,000/- లను విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులకు నగదు అందజేసి, అన్నదానం కొనసాగేందుకు తన వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఎస్.రావు మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మంత్రి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 వ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
