ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
నేటి చర్చ : ఇల్లందు, ఇల్లందు మండల పరిధిలోని వేపల గడ్డ తండాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. తండాకు చెందిన భూక్య శివ్లా మృతి చెందగా, ప్రాథమికంగా (ఆత్మహత్య) గా భావిస్తున్నప్పటికీ ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శివ్లా మృతి వెనుక వ్యక్తమవుతున్న కారణాలు మరియు గతంలోనూ ఇదే తరహా ఘటనలు మూడు, నాలుగు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతుండటంతో తండావాసుల్లో ఆందోళన నెలకొంది.
ఒకే ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కారణాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఇల్లందు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉంది. మృతదేహాన్ని పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు, ఇతర ఆధారాల ద్వారా మృతికి గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది. అనుమానాలకు తావులేకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
